అద్దంకి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం అజయ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పథకానికి ఎంపికై న 13 మందికి శనివారం రూ.17.50 లక్షల రుణాల చెక్కులు అందజేశారు. ఏపీఎం మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరయ్యే ఈ రుణంలో రూ.50వేలు రాయితీ పోను, లబ్ధిదారు వాటా, మిగిలిన రుణాన్ని సున్నా వడ్డీతో తిరిగి సక్రమంగా చెల్లించాలని చెప్పారు. ఏపీఎం కోటేశ్వరరావు పాల్గొన్నారు.
లైంగిక వేధింపుల
నివారణపై అవగాహన
కర్లపాలెం: లైంగిక వేధింపుల నివారణ, పోక్సో చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఆరో అదనపు జడ్జి కె.శ్యామ్‌బాబు చెప్పారు. కర్లపాలెం మండల పరిఽధిలోని పేరలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి కె.శ్యామ్‌బాబు మాట్లాడుతూ లైంగిక వేధింపులు, అశ్లీలత వంటి నేరాల వంటివి విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారన్నారు. చట్టాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా పేదలు న్యాయ సహాయం పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో పేరలి గ్రామ సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, న్యాయవాదులు, డి.కిరణ్, టి.విజయ్‌కుమార్, కె.శ్రీనివాసరావు, వీరాస్వామి ఫౌండేషన్ అధ్యక్షుడు గొర్రుముచ్చు వందనం తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లోనే సహకార
సంఘాల లావాదేవీలు
నరసరావుపేట: ఇకపై సహకార సంఘాలలో అన్ని లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా శనివారం జిల్లా సహకార బ్యాంక్ ఆవరణలో పీఏసీలు, సీఈవోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరి సహకార సంఘాలు పనిచేయాలన్నారు. అవసరమైతే తగిన ఫర్నిచర్ సమకూర్చుకోవాలని తెలిపారు. సభ్యులకు ఆన్‌లైన్ సేవలు అందించాలని చెప్పారు. గో లైవ్‌కు వెళ్లిన అన్ని పీఏసీలు ముందుగా నెట్‌వర్క్ పనితీరును పరీక్షించుకోవాలని చెప్పారు. సభ్యుల డేటా సరిగ్గా నమోదైందో లేదో లాగిన్ చేసి పరిశీలించుకోవాలని కోరారు. సిబ్బందిలో అవసరమైన వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సిస్టమ్ ఆడిట్‌లో భాగంగా అన్ని మాడ్యూల్స్ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో పరీక్షించుకోవాలని సూచించారు. రియల్ టైం ఎంట్రీ ప్రారంభించాలని, ఏ రోజుకుకారోజు ఆన్‌లైన్ లావాదేవీలు సక్రమంగా చేస్తూ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. జిల్లాలో 59 పీఏసీలకుగాను 38 పీఏసీలలో గో లైవ్‌కు వెళ్లిన సీఇవోలు, జిల్లా సహకార ఆడిట్ అధికారి డి. శ్రీనివాసరావు, బ్యాంకు సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పీఎం అజయ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
పీఎం అజయ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి