ఆధునిక వ్యవసాయంతో ఎంతో మేలు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక వ్యవసాయంతో ఎంతో మేలు

Published Sat, Mar 22 2025 2:04 AM | Last Updated on Sat, Mar 22 2025 2:03 AM

మార్టూరు: ప్రస్తుత ఆధునిక వ్యవసాయంలో నర్సరీల పాత్ర కీలకమైందని.. షేడ్‌ నెట్‌లలో తయారైన నారు ఇతర ఉద్యాన మొక్కల పెంపకంతో రైతులకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం చేకూరుతుందని దర్శి ఉద్యాన శాఖ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.రవీంద్రబాబు అన్నారు. స్థానిక రాజుపాలెం కూడలిలోని సాయిబాలాజీ కల్యాణ మండపంలో శుక్రవారం బాపట్ల జిల్లా స్థాయి నర్సరీ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధిక ఉత్పత్తులు సాధించాలంటే ఆరోగ్యకరమైన మొక్కలు అవసరమన్నారు. నర్సరీల్లో పెంచిన మొక్కలతోనే అది సాధ్యమన్నారు. గుంటూరు లాం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.రజిని మిరప పంటలో వచ్చే తెగుళ్లు, పురుగులు వాటి నివారణ గురించి రైతులకు వివరించారు. బాపట్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి పి.జెన్నెమ్మ నర్సరీల చట్టం 2010 ప్రకారం నర్సరీల రిజిస్ట్రేషన్లు వాటి నిర్వహణ విధానాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఏపీఎంఐ పీడీ బీవీ రమణ మాట్లాడుతూ, ఏపీ, సీఎన్‌ఎఫ్‌ జిల్లా డీపీఎం, వాణిశ్రీ, గాండీవ రైతు ఉత్పత్తిదారుల సంస్థ చైర్మన్‌ పెంటేల శరత్‌ , డిజిటల్‌ గ్రీన్‌ సంస్థ ప్రతినిధి ఎం విజయ రేఖారెడ్డి, మార్టూరు వ్యవసాయ శాఖ ఏడీఏ, కేవీ శ్రీనివాసరావు, మార్టూరు, అద్దంకి, పర్చూరు, చీరాల, కొల్లూరు, ఉద్యానవన శాఖ అధికారులు బి. హనుమంతు నాయక్‌, దీప్తి, అలేఖ్య, రవి ప్రకాష్‌ బాబు, కళ్యాణ చక్రవర్తి, మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ఏవోలు బి. అంజిరెడ్డి, కుమారి, లావణ్య, రాజశేఖర్‌, వీఏఏలు, ప్రకృతి సేద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement