A Woman Pours Hot Oil on Her Sleeping Boyfriend in Guntur - Sakshi
Sakshi News home page

భర్త మీద అనుమానం.. సలసల కాగే నూనె పోసింది

Jul 28 2023 2:12 AM | Updated on Jul 28 2023 8:38 PM

- - Sakshi

నాగమణికి సంతానం కలిగే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం నాగరాజు మరొకామెను పెళ్లి చేసుకోవాలని ఆలోచన

గుంటూరు: నిద్రిస్తున్న ప్రియుడిపై ఓ మహిళ సలసల కాగే నూనెపోసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన నకరికల్లులో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నకరికల్లుకు చెందిన ఆతుకూరి నాగరాజు, జగన్నాథపు నాగమణి కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. నాగమణికి సంతానం కలిగే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం నాగరాజు మరొకామెను పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు నాగమణికి అనుమానం కలిగింది.

ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఈనెల 26న నాగరాజు ఇంట్లో నిద్రిస్తుండగా అతడిని చంపాలన్న ఉద్దేశంలో నూనెను బాగా కాగబెట్టి నాగరాజు ఒంటిపై పోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజు కేకలు వేయడంతో స్థానికులు 108 సహాయంతో నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ ఎ.బాలకృష్ణ గురువారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement