Today Horoscope 21-09-2022 In Telugu - Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, ధన లాభం

Published Wed, Sep 21 2022 6:48 AM

Today Horoscope 21-09-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ఏకాదశి రా.10.23 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం: పుష్యమి రా.11.53 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.6.11 నుండి 7.55 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.19 వరకు అమృతఘడియలు: సా.4.46 నుండి 6.33 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.57
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.

వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో కొత్త ఆశలు..

మిథునం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో జాప్యం.  ఆలోచనలు కలసిరావు. కొన్ని సమస్యలతో కుస్తీపడతారు. వ్యాపారాలు సాధారణంగానే ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష ఆదరణ. భూలాభాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

సింహం: వ్యవహారాలలో ఇబ్బందులు.  సోదరులతో విభేదాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతలు.

కన్య: ఆప్తుల ద్వారా శుభవార్తలు.  కొన్ని బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య కార్యక్రమాలలో విజయం. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు అనుకూలిస్తాయి.ఉద్యోగాలు సానుకూలమవుతాయి.

వృశ్చికం: వ్యవహారాలు  నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో విభేదాలు.వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: వ్యవహారాలలో కొంత ఇబ్బందులు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృథా ధనవ్యయం. బంధు,మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో  ఒత్తిడులు అ«ధిగమిస్తారు.

కుంభం: మిత్రులతో సంతోషదాయకంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత. ఒక ప్రకటన ఆకట్టుకుటుంది. వాహనయోగం.  వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి.

మీనం: కొన్ని పనులలో కొన్ని అవాంతరాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.  ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

Advertisement
 
Advertisement
 
Advertisement