ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం

Today Horoscope 16-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.పంచమి రా.12.16 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం: రేవతి రా.1.53 వరకు, తదుపరి అశ్వని,, వర్జ్యం: ప.1.52 నుండి 3.26 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.07 వరకు, తదుపరి రా.10.55 నుండి 11.42 వరకు అమృతఘడియలు: రా.11.27నుండి 1.04 వరకు.

సూర్యోదయం :    5.46, సూర్యాస్తమయం   :  6.23, రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు, యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

వృషభం:ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. పనులలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

మిథునం: శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా  పనులు పూర్తి చేస్తారు. సంఘంలోగౌరవం. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.

సింహం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దైవదర్శనాలు.

కన్య: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: దూరపు బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది. 
మకరం.....కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. వాహనయోగం.

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మీనం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top