ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తులు కొనుగోలు చేస్తారు | Rasi Phalalu: Daily Horoscope On 30-03-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తులు కొనుగోలు చేస్తారు

Mar 30 2025 12:17 AM | Updated on Mar 30 2025 9:38 AM

Rasi Phalalu: Daily Horoscope On 30-03-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.పాడ్యమి ప.2.44 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: రేవతి సా.6.44 వరకు, తదుపరి అశ్విని,వర్జ్యం: ఉ.7.34 నుండి 9.02 వరకు, దుర్ముహూర్తం: సా.4.36 నుండి 5.24 వరకు, అమృత ఘడియలు: సా.4.26 నుండి 5.56 వరకు.

సూర్యోదయం  :  6.00
సూర్యాస్తమయం :  6.08
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...పరిచయాలు పెరుగుతాయి. వృథా ఖర్చులు చేస్తారు. ఆలోచనలు కొలిక్కి రావు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో కొంత ప్రోత్సాహం.

వృషభం...పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తులు, వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి.

మిథునం....మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం...వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తులు, వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు.

సింహం....మీ శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కన్య....చిరకాల మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలం.

తుల...రుణవిముక్తి లభిస్తుంది. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం....ఆర్థిక ఇబ్బందులు కాస్త తొలగుతాయి. దూరపు బంధువుల కలయిక. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు....రాబడి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తులు, వ్యాపారాలు నిదానిస్తాయి.

మకరం....దూరప్రాంతాల నుండి కీలక సమాచారం. యత్నకార్యసిద్ధి. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. నిర్ణయాలలో మిత్రుల సలహాలు. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం....మిత్రుల నుండి కొంత ఒత్తిడులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

మీనం...ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి. దైవదర్శనాలు. ధనప్రాప్తి. శుభకార్యాలపై చర్చలు. వృత్తులు, వ్యాపారాలను సాఫీగా కొనసాగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement