ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 04-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Apr 4 2026 3:27 AM | Updated on Apr 4 2026 3:27 AM

Rasi Phalalu: Daily Horoscope On 04-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.విదియ ఉ.8.31వరకు, తదుపరి తదియ, నక్షత్రం: స్వాతి రా.8.11 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: రా.2.21 నుండి 4.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.56 నుండి 7.34 వరకు,అమృత ఘడియలు: ఉ.10.41 నుండి 12.26 వరకు.

సూర్యోదయం :    5.57
సూర్యాస్తమయం     :  6.10
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. పనుల్లో విజయం.విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆశయాలు నెరవేరతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.

మిథునం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. నిరుద్యోగుల యత్నాలలో స్వల్ప ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. విద్యార్థులు నిరాశ చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కన్య: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. దైవదర్శనాలు.

తుల: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు. వృతి,వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం: పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. బంధువుల కలయిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement