ఈ రాశి వారికి వస్తులాభాలు.. వ్యాపారాలలో పురోభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 27-09-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వస్తులాభాలు.. వ్యాపారాలలో పురోభివృద్ధి

Sep 27 2025 5:15 AM | Updated on Sep 27 2025 5:23 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-09-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.పంచమి ఉ.8.24 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: అనూరాధ రా.10.50 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: తె.5.00 నుండి 6.46 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.29 వరకు, అమృత ఘడియలు:  ఉ.11.15 నుండి 1.03 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.52
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం: శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావర ణం.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

సింహం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

కన్య: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. కార్యసిద్ధి. పనులు అనుకున్న విధంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ధనవ్యయం. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: బంధువులతో సఖ్యత. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement