
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.చతుర్దశి సా.6.33 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: రోహిణి ప.12.49 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: సా.6.07 నుండి 7.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: ఉ.9.50 నుండి 11.20 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.34.
👉: మేషం.... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
👉: వృషభం....వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. ధనలాభం. నూతన ఒప్పందాలు. ఆస్తిలాభ సూచనలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
👉: మిథునం....ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
👉: కర్కాటకం...చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
👉: సింహం....సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
👉: కన్య....సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
👉:తుల....పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. వైద్యసేవలు.
👉: వృశ్చికం....ఇతరులకు సైతం సాయపడతారు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం. పనుల్లో ప్రతిష్ఠంభన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
👉: ధనుస్సు...కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
👉: మకరం...కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వైద్యసేవలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
👉: కుంభం...మిత్రులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
👉: మీనం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.