ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 05-04-26 To 11-04-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Apr 5 2026 4:36 AM | Updated on Apr 5 2026 4:36 AM

Weekly Horoscope Telugu 05-04-26 To 11-04-2026

మేషం...
చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సోదరులు, సోదరీల నుంచి సహాయం అందుతుంది. ఇంతకాలం వేధించిన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. భూవివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం  మధ్యలో ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం...
ఎంతటి కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ వేడుకల్లో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక అశాంతి. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఎరుపు, నేరేడు రంగులు,  దేవీస్తోత్రాలు పఠించండి.

మిథునం....
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకూ అనుకూలిస్తుంది. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ నిరూపించుకుంటారు. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. పనిఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు,  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కర్కాటకం....
పనులను చక్కదిద్దేందుకు మరింత శ్రమ పడతారు.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పరిచయాలు పెరుగుతాయి. ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు,  కనకధారాస్తోత్రం పఠించండి.

సింహం....
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. నీలం, నేరేడురంగులు,  శివపంచాక్షరి పఠించండి.

కన్య....
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ధనలాభం. గులాబీ, లేత ఎరుపు రంగులు,  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి..

తుల...
ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. రియల్‌ఎస్టేట్‌ వారికి లాభదాయకంగా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు, . గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం....
కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల మెప్పు పొందుతారు. కొన్ని నిర్ణయాలకు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుతాయి. వస్తు, వాహన లాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు,  శ్రీదత్తాత్రేయుని పూజించండి..

ధనుస్సు...
ఉన్నతస్థాయి వారితో పరిచయాలు. ఆసక్తికర సమాచారం అందుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు,  గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం....
కుటుంబసభ్యులతో కష్టసుఖాలు పంచుకుంటారు. పనులను సకాలంలో చక్కదిద్దుతారు.   ఆత్మీయుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆరోగ్యం మరింత కుదుటుపడుతుంది. వాహనయోగం.. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం మరింత తగ్గవచ్చు.. క్రీడాకారులు, కళాకారులకు శుభవార్తలు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. మనోధైర్యం తగ్గుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు,  లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కుంభం....
రాబడి కనిపించినా  ఖర్చులు ఎదురవుతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంతవరకూ తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమసమస్యలు, నీలం, నేరేడు రంగులు,  సుబ్రహ్మణ్యేశ్వరస్తోత్రాలు పఠించండి.

మీనం....
ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు కొంతవరకూ పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వేడుకల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం ఉండవచ్చు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి. కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో ఖర్చులు. వ్యయప్రయాసలు. గులాబీ, తెలుపు రంగులు, గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement