
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.అష్టమి రా.10.54 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: భరణి ఉ.8.29 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.7.39 నుండి 9.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: తె.4.33 నుండి 6.01 వరకు (తెల్లవారితే ఆదివారం), శ్రీకృష్ణాష్టమి.
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.23
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. పనుల్లో ఆటంకాలు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు.
కర్కాటకం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.
సింహం: సన్నిహితులతో అకారణ వైరం. చర్చలు ఫలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య: రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
తుల: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
మకరం: విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది పరుస్తాయి.
కుంభం: వ్యవహారాలలో విజయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మీనం: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.