ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు | Today Telugu Horoscope On July 3rd, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Jul 3 2026 3:02 AM | Updated on Jul 3 2026 8:45 AM

Rasi Phalalu: Daily Horoscope On 03-07-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.తదియ ఉ.9.03 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: శ్రవణం ఉ.10.24 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.2.38 నుండి 4.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.09 నుండి 9.01 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.22 వరకు, అమృత ఘడియలు: రా.12.45 నుండి 1.20 వరకు, సంకటహర చతుర్ధి.

సూర్యోదయం : 5.33
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం...  ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. దైవదర్శనాలు.

వృషభం...  ధన, వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవచింతన.

మిథునం...  పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం...  పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, గృహయోగాలు. స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

సింహం...  పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కన్య...  వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

తుల...  సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం...  కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వస్తులాభాలు.

ధనుస్సు...  నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం...  పనులు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. అదనపు బాధ్యతలు. వృత్తి,వ్యాపారాలలో కొంత నిరుత్సాహం.

కుంభం...  ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం...  ఆకస్మిక ధన, వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement