గ్రహం అనుగ్రహం (28-11-2020) 

Daily Horoscope In Telugu (28-11-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.త్రయోదశి ఉ.10.04 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం భరణి రా.3.40 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం ఉ.11.43 నుంచి 1.27 వరకు దుర్ముహూర్తం ఉ.6.15 నుంచి 7.45 వరకు అమృతఘడియలు... రా.10.16 నుంచి 11.43 వరకు.

సూర్యోదయం :    6.16
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు.  ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: ప్రముఖులతో పరిచయాలు. ధనలాభాలు. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

సింహం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ప్రయాణాలలో కొన్ని మార్పులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కన్య: కొన్ని పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు.  శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వస్తులాభాలు. కొత్త పరిచయాలు. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు.

వృశ్చికం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో మరిన్ని లాభాలు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

ధనుస్సు: కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

కుంభం: ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మిత్రులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా మారవచ్చు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top