గ్రహం అనుగ్రహం (17-08-2020) | Daily Horoscope in Telugu (17-08-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (17-08-2020)

Aug 17 2020 5:42 AM | Updated on Aug 17 2020 5:42 AM

Daily Horoscope in Telugu (17-08-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. శ్రావణ మాసం. తిథి బ.త్రయోదశి ఉ.10.36 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పుష్యమి తె.5.34 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి ఆశ్లేష. వర్జ్యం ప.1.37 నుంచి 3.12 వరకు. దుర్ముహూర్తం ప.12.28 నుంచి 1.48 వరకు, తదుపరి ప.3.01 నుంచి 1.20 వరకు. అమృత ఘడియలు రా.11.11 నుంచి 12.45 వరకుసూర్యోదయం: 5.46 సూర్యాస్తమయం: 6.22

రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం....కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

వృషభం....పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం....సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కర్కాటకం....సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం...ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య....బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల...మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృశ్చికం....పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు....దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం....శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కుంభం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువుల నుంచి ధనలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం...వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement