ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు

Daily Horoscope In Telugu 11th July 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.పాడ్యమి ఉ.6.45 వరకు, తదుపరి విదియ నక్షత్రం పుష్యమి రా.2.02 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం ఉ.9.11 నుండి 10.54 వరకు, దుర్ముహూర్తం సా.4.50 నుండి 5.42 వరకు, అమృతఘడియలు... రా.7.16 నుండి 8.57 వరకు.

సూర్యోదయం        :  5.36
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. రుణయత్నాలు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

వృషభం: విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారం. ముఖ్యులతో పరిచయాలు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మిథునం: పనులు కొంత మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. దైవదర్శనాలు.

కర్కాటకం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబ సమస్యలు తీరతాయి. ప్రముఖుల ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనయోగం.

సింహం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణయత్నాలు. ఇంటాబయటా వివాదాలు. శ్రమ తప్పదు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి.  నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: బంధువుల నుంచి ధనలాభం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. గృహం, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.  చర్చలు సఫలం.

వృశ్చికం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కొన్ని పనులలో ఆటంకాలు. పనులలో ఆటంకాలు.

ధనుస్సు: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి  నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: చిన్ననాటి మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు శుభవార్తలు.

కుంభం: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వస్తులాభాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: పనులలో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. 
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top