కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం క్యాంపస్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు ఎం.ఎస్.సి. (కంప్యూటర్ సైన్స్) / ఎం.సి.ఎ. /ఎం.టెక్. కంప్యూటర్స్ అర్హత ఉండాల న్నారు. నెట్/సెట్/ పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు నేరుగా విశ్వవిద్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలని సూచించారు.
మదనపల్లె: ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమ వారం ఉదయం పది గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్‌న్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని మదనపల్లె కలెక్టరేట్‌తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా వెబ్‌సైట్‌లోనూ నమోదు చేసుకోవచ్చని, వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఫిర్యాదుల స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ కు సంప్రదించవచ్చని తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని సూచించారు.
మదనపల్లె: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 89777 16661కు ఫోన్‌చేసి తమ విద్యుత్ సమస్యలను తెలపవచ్చని తెలిపారు.
సర్కిల్ స్థాయిలో...
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్ స్థాయిలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను 94408 17449 నంబర్‌కు తెలియజేసి పరిష్కారం పొందాలని కోరారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి భక్తులు ఆదివారం భకి్‌త్‌శ్రశద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తుల ఆలయంలో అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు.
కురబలకోట: మదనపల్లి దగ్గరున్న అంగళ్లు లోని మిట్స్ డీమ్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు లక్షల చొప్పున స్కాలర్ షిప్‌లు మంజూరు కావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేషనల్ స్కాలర్‌షిప్‌లు లభించినట్లు వీసీ యువరాజ్ ఆదివారం తెలిపారు. పేద ఆపై ప్రతిభావంతులైన ఏడు మంది ఎంసీఏ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున రూ.21 లక్షలు లభించినట్లు తెలిపారు. ఇద్దరి ఎంబీఏ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష 50 వేలు చొప్పున, స్కాలర్ షిప్ లభించిందని వెల్లడించారు. ఇలా తొమ్మిది మందికి మొత్తం రూ.రూ. 24 లక్షలు స్కాలర్‌షిప్ రావడం విశేషంగా మారింది. చాన్స్‌లర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్‌లర్ నాదేళ్ల ద్వారకనాధ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల స్టూడెంట్ అఫైర్స్ సీనియర్ మేనేజర్ డాక్టర్ పి.అథాహర్ సమీనా విద్యార్థులను అభినందించారు.


