చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరగడంతో బోయకొండపై ఎటుచూసినా భక్త జన సందోహంతో పోటెత్తింది. సెలవు దినం కావడం, పరీక్షలు పూర్తి కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు,యువత, ఉద్యోగస్తులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు.
ఆలయంలో భక్తుల రద్దీ


