కడప సెవెన్‌రోడ్స్ : తన పునరుత్తానంతో తానే జీవమునని క్రీస్తు ఏసు లోకానికి చాటారని మరియాపురం సెయింట్ క్యాథడ్రల్ చర్చి బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ అన్నారు. ఆదివారం క్రీస్తు పునరుత్తానం (ఈస్టర్) పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున విశ్వాసులు చర్చి ఆవరణలోకి తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. ద్వేషం ఉన్నచోట ప్రేమను, అశాంతి ఉన్నచోట సమాధానాన్ని నెలకొల్పి సత్యాన్ని స్థాపించడమే ఈస్టర్ పండుగ అసలైన పరమార్థమని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు


