నిఘా నీడలో | - | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో

Apr 6 2026 8:06 AM | Updated on Apr 6 2026 8:06 AM

మూల్యాంకనం

మదనపల్లె: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. రాయచోటి కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాధాన పత్రాలకు కోడింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈ పేపర్ల మూ ల్యాంకనానికి జిల్లావ్యాప్తంగా759 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో జవాబు పత్రాలకు మూల్యాంకన నిర్వహించే అసిస్టెంట్‌ ఎగ్జామినర్లతోపాటు వాటిని పరిశీలించేందుకు చీప్‌ ఎగ్జామినర్‌, స్పెషల్‌ అసిస్టెంట్లను సిద్ధం చేశారు. ఈ మూల్యాంకనానికి పక్రియకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రహ్మణ్యం క్యాంపు ఆపీసర్‌గా వ్యవహరించనున్నారు. మూల్యాంకన కేంద్రంలో అన్ని గదులతోపాటు ఆవరణంలో కూడా సీసీ కెమోరాలను ఏర్పాటు చేశారు. దీంతో మూల్యాంకన ప్రక్రియ మొత్తం నిఘా నీడలో జరగనుంది. రీ వెరిఫికేషన్‌లో ఏవైనా తప్పులు దొర్లితే ఏ అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ వద్ద పొరపాటు జరిగిందో అమరావతిలో తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ట్యాబ్‌తో మూల్యాంకనం మొదటి సారి చేస్తున్నారు.

విడతల వారీగా..

ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయ నున్నారు. ఇందుకోసం 759 మంది సబ్జెక్టు టీచర్లను విద్యాశాఖ నియమించింది. వీరికి మూల్యాంకన నిర్వహణపై శిక్షణను కూడా ఇచ్చారు.

నిబంధనలు ఇలా...

● ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌, స్మార్ట్‌ఫోన్లు, ఎరైజర్‌, వైట్నర్‌ తదితర వస్తువులను మూల్యాంకన కేంద్రంలోకి తీసుకువెళ్లరాదు

● ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన కేంద్రంలో ఎటువంటి తప్పిదాలు జరిగినా ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

● మూల్యాంకన కేంద్రంలో విధులకు హాజ రయ్యే సిబ్బంది సమయానికి హాజరు కావాలి. లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

● మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. గుర్తింపు కార్డు ఉన్న వారినే ఆ ప్రాంతంలోకి అనుమతించనున్నారు.

నేటి నుంచి పది మూల్యాంకనం

ఏర్పాట్లు సిద్ధం చేసిన విద్యాశాఖ

జిల్లాకు జవాబుపత్రాలు రాక

759 మందిసిబ్బందితో మూల్యాంకనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement