సంబేపల్లె : సంబేపల్లె మండలంలో సలీంద్ర అనిల్ కుమార్ (25) అనే యువకుడు శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాలమేరకు దుద్యాల గ్రామం పెద్దకోడివాండ్లపల్లెకు చెందిన అనిల్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటిలో ఎవరూ లేని తాడుతో ఇంటిపైకప్పు కొక్కీకి ఉరివేసుకున్నాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికిన పోలీసులు చేరుకొని విచారించి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తలరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
గాలివీడు : ఈతకు వెళ్లిన విద్యార్థి కొత్తకోట రోహిత్(14) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు గోరాన్ చెరువు గ్రామం కుమ్మరపల్లెకు చెందిన కొత్తకోట సుధాకర్ కుమారుడు రోహిత్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి సమీపంలోని పెద్ద చెరువుకు ఈత కొట్టడానికి వెళ్లాడు. తనతో పాటు తెచ్చుకున్న బైక్ ట్యూబ్‌ను నడుముకు కట్టుకుని నీటిలోకి దిగిన రోహిత్, ప్రమాదవశాత్తు ట్యూబ్ జారిపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అప్రమత్తమైన తోటి పిల్లలు గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.ఫలితం లేకపోవడంతో అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహకారంతో విద్యార్థి మతదేహాన్ని వెలికితీశారు.
ఫుట్‌బాల్ లీగ్ ప్రారంభం
మదనపల్లె సిటీ : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీ ఫుట్‌బాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జిల్లా లెజెండ్స్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయస్థాయి పుట్‌బాల్ చరిత్రలో లెజెండ్స్‌గా నిలిచిన మెస్సి, రోనాల్డోపీలే, మారడానో, బూటియా,ఛత్రిల పేర్లతో ఆరు జట్లు బాల, బాలికలు, మిక్స్ జెండర్ విభాగాల్లో ఆండర్–12,అండర్–4 స్థాయిల్లో పోటీలు జరుగుతాయని పుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ చంద్రశేఖర్, క్రీడాభారతి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నరేష్‌బాబు, హెచ్‌ఎం సుబ్బారెడ్డి, సభ్యులు దిలీప్, కమలేష్, మహేంద్రనాయక్, కిరణ్ పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగిని
ఆత్మహత్య
రాయచోటి టౌన్ : భర్తతో చిన్న పాటి మనస్పర్థలతో భార్య ఆత్మహత్య చేసుకొంది. రాయచో టి అర్బన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణ పరిధిలోని మాసాపేకు చెందిన రియాజ్ భార్య రోషిణి (25) రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తోంది. వీరికి గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మధ్య గత కొన్ని రోజులుగా మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. దీంతో శనివారం రోషిణి ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


