30 శాతం ఐఆర్‌ వెంటనే ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

30 శాతం ఐఆర్‌ వెంటనే ప్రకటించాలి

Apr 6 2026 7:30 AM | Updated on Apr 6 2026 7:30 AM

మదనపల్లె సిటీ : 12వ వేతన సవరణ అమలు ఆలస్యం అవుతున్న కారణంగా 30 శాతం మద్యంతర భృతి వెంటనే ప్రకటించాలని అఖిల భారత సెకండరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం మదనపల్లెలో ఎస్టీయూ భవన్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. 2023 జులై నుంచి 12 పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఆలస్యమైనందున ప్రస్తుత ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించాలన్నారు. 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లు మధ్యంతర భృతి కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌, జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్‌, డివిజన్‌ కన్వీనర్లు శ్రీనాథ్‌, బ్రహ్మానందం, రాజారెడ్డి,శేఖర్‌రెడ్డి, లింగమూర్తి, ఎల్లారెడ్డి, అశోక్‌, చలపతి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు. మందుగా బాబు జగజ్జీవన్‌రాం జయంతి, ఎస్టీయూ ఉద్యమకారులైన వీణవిజయరామరాజు వర్ధంతి ప్రత్యేకతను తెలియజేస్తూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement