11.40 లక్షల చేప పిల్లలు విడుదల
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కోటపాడు సోమశిల వెనుక జలాల్లో 11.40 లక్షల చేప పిల్లలను వదిలిపెట్టారు. శుక్రవారం కడప జిల్లా మత్య్స శాఖ డీడీ నాగయ్య ఆధ్వర్యంలో జడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి, ఎంపీడీవో సుజాత, రెవెన్యూ ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి, మండలంలోని అధికార పార్టీ నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డీడీ నాగయ్య మాట్లాడుతూ..ఒంటిమిట్టలోని సోమశిల వెనుక జలాలలో మత్స్య సంపద మెరుగు పరిచేందుకు పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా మత్య్సకారులకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో ఇక్కడ చేప పిల్లలను వదిలినట్లు చెప్పారు. కార్యక్రమంలో మత్య్సశాఖ స్పెషల్ ఆఫీసర్ సుస్మిత, ఎఫ్‌డీవో కిరణ్ కుమార్, జిల్లా మత్య్స సంఘం డైరెక్టర్, కుడమలూరు మత్స్యకారుల సొసైటీ ప్రెసిడెంట్ గుడి రమణ, నాయకులు గజ్జల నరసింహారెడ్డి, ఎస్వీ రమణ, బొబ్బిలి రాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు కల్చరల్ : బెంగాల్ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాన మంత్రి న రేందర మోదీ వందేమాతరం గేయాన్ని వివాదాస్పదం చేయడం విచారకరమని సీ పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ పార్టీ శత జ యంతి ఉత్సవాల్లో భాగంగా ‘వర్తమాన రాజకీయాలు – కమ్యూనిస్టుల కర్తవ్యం’ అన్న అంశంపై ప్రొద్దుటూరులో ఓ ఫంక్షన్ హాల్‌లో సదస్సు నిర్వహించారు. మొ దట పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అ నంతరం జరిగిన సదస్సులో ఈశ్వరయ్య మాట్లాడుతూ కేరళలో ఎన్నికలు జరిగితే అయ్యప్పస్వామిని, కర్ణాటకలో జరిగితే హిజాబ్ అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ ప్రయత్నించారని విమర్శించారు. ఉస్మానియా యూ నివర్సిటీ ప్రొఫెసర్ సి.ఖాసీం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమానత్వం, సమాన హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది అన్నారు.


