ప్రత్యర్థుల దాడుల్లో ఇద్దరికి గాయాలు
మదనపల్లె : ఆస్తులకు సంబంధించిన వివాదాలతో జరిగిన దాడిలో ఇద్దరు రైతులు ప్రత్యర్థుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన సంఘటనలు పెద్ద తిప్పసముద్రం, రామసముద్రం మండలాల్లో జరిగాయి. బాధితుల కథనం మేరకు వివరాలు. టిఎం మండలం పులికల్లుకు చెందిన రైతు వెంకటాద్రి (51)కి శ్రీనివాసులుతో ఆస్తి వివాదం నడుస్తోంది. దీంతో శ్రీనివాసులు రైతు వెంకటాద్రిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్టు బాధితులు తెలిపారు. కుటుంబీకులు వెంకటాద్రిని మదనపల్లెకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిహరప్రసాద్ తెలిపారు.
● రామసముద్రం మండలం బలిజపల్లెకి చెందిన రైతు జి.వెంకటరమణ(68)కు ఇదే గ్రామానికి చెందిన కృష్ణప్పతో ఆస్తి వివాదం ఉంది. ఆదివారం జరిగిన గొడవలో వెంకట రమణపై కృష్ణప్ప కర్రతో దాడి చేరడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.
యథేచ్ఛగా ముగ్గురాయి
అక్రమ తవ్వకాలు
వేంపల్లె(వైఎస్‌ఆర్ కడప జిల్లా) : వేంపల్లి మండలంలో యథేచ్ఛగా ముగ్గురాయి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా విజిలెన్స్, మైనింగ్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. నియోజకవర్గ టీడీపీ నాయకుల అండదండలతో.. వేంపల్లి మండలంలో కొందరు టీడీపీ నాయకులు విచ్చలవిడిగా ముగ్గురాయి తవ్వకాలు చేస్తున్నారు. వేంపల్లి, వేముల మండలాల వ్యాప్తంగా సుమారు ఇరవై చోట్ల వివిధ ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మండలంలోని తాళ్లపల్లి గ్రామం వద్ద ముగ్గురాయిని ట్రిప్పర్‌తో తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకోవడంతో విషయం అంతా బయటపడింది. మండల పరిధి బక్కన్నగారిపల్లెలో.. కోర్టు పరిధిలో ఉన్న కడపలోని నియమతుల్లా చెందిన మైనింగ్‌పై విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని అధికారులు నిర్ధారించి అక్కడ ఉన్న క్రేన్లు, డీజిల్ ఇంజన్లు, అందుకు సంబంధించిన పరికరాలను సీజ్ చేసి వేంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గత ఏడాదిన్నరగా టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్ అధికారులకు కనపడలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో.. శనివారం అక్రమంగా తరలిస్తున్న ముగ్గు రాయి టిప్పర్‌ను పట్టుకోవడంతో.. ఈ ముగ్గురాయి ఎక్కడి నుంచి వస్తున్నదని ఆరా తీయడంతో బట్టబయలు అయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి విస్తృతంగా దాడులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గాయపడిన వెంకటాద్రి, వెంకటరమణ
ప్రత్యర్థుల దాడుల్లో ఇద్దరికి గాయాలు
ప్రత్యర్థుల దాడుల్లో ఇద్దరికి గాయాలు


