అన్నమయ్య చెంతకు.. గోవిందుడు!
దశాబ్దంన్నర తర్వాత..
రాజంపేట: అదివో..అల్లదివో..శ్రీహరివాసం..బ్రహ్మకడిగిన పాదం..అంటూ సులువైన పదాలతో కీర్తనలు అలపించిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో తాజాగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం అందుబాటులోకి రానుంది. పర్యాటకులు,యాత్రికులు శ్రీవారి దర్శించుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) కల్పించింది. వైఎస్సార్‌సీపీ పాలనలో అన్నమయ్య జన్మస్థలం అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయి. ఫలితంగా శ్రీవారి ఆలయం నిర్మితమైంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 3 వరకు శ్రీవారి విగ్రహప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది.
సాక్షి వరుస కథనాలు
శ్రీవారి ఆలయం భక్తులకు అందుబాటులో లేకుండా పోయిందనే ఆవేదనపై సాక్షి వరుస కథనాలను ప్రచురించింది. ఈ మార్గంలో నిత్యం టీటీడీ ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తున్న చూస్తూ పోతున్నారని, భక్తులకు శ్రీవారి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం చేస్తున్నారనే కోణంలో కథనాలు ప్రచురించింది. అవి టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. ఎట్టకేలకు శ్రీవారి ఆలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవాలను తలపెట్టింది.
600 జయంత్యుత్సవాల నుంచి..
అన్నమాచార్యుని 600 జయంత్యుత్సవాలు అప్పటి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హయాంలో జరిగాయి. 108 అడుగుల అన్నమయ్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత అన్నమయ్య థీంపార్కు అభివృద్ధిని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అటకెక్కించాయి. అప్పటి టీటీడీ పాలకమండలి తాళ్లపాక, అన్నమయ్య థీంపార్కు అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి కృషి ఫలితంగా చైర్మన్ థీంపార్కును సందర్శించారు. ఎన్నికల ముందు అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హయాంలో మళ్లీ అన్న మయ్య జన్మస్థలి అభివృద్ధిపై దృష్టి సారించారు.
అన్నమయ్య ఉద్యానవనంలో దశాబ్బంన్నర తర్వా వైఎస్సార్‌సీపీ పాలనలో మళ్లీ శ్రీవారి ఆలయ నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో ఎంపిక చేసిన స్థలంలో ఆలయం నిర్మించారు. టీటీడీ రూ.కోటికిపైగా వ్యయం చేస్తోంది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్లే దక్షిణభారత యాత్రికులు ముందుగానే అన్నమయ్య జన్మస్థలిలో శ్రీవారిని దర్శించుకోవడం మహాదానందగా భావిస్తున్నారు. తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం ప్రాంతం పార్కును టీటీడీ అటవీశాఖ సిద్ధం చేసింది. ఆలయం నిర్మాణం పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి టీటీడీ సన్నద్ధం కావడం శుభపరిణామంగా భక్తులు భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో ఆలయం పూర్తి
ఎట్టకేలకు శ్రీవారి ఆలయం ప్రారంభం
ఈనెల 31 నుంచివిగ్రహప్రతిష్టమహోత్సవాలు
అన్నమయ్య చెంతకు.. గోవిందుడు!
అన్నమయ్య చెంతకు.. గోవిందుడు!


