● వేగానికి లేని కళ్లెం
సాక్షి, రాయచోటి: కర్నూలు సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రైవేట్ స్లీపర్ బస్సు ఘటన భయపెడుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యమో.. అవతల నుంచి వచ్చి పడిపోయిన బైక్‌కు సంబంధించిన వారి మద్యంమత్తో తెలియదు కానీ... 19 మంది ప్రాణాలు పోవడంతో ప్రస్తుతం ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే కొంత మేర అభద్రతా భావం ఉంటుంది. అయితే మొన్న బస్సు కాలిపోయిన ఘటనతో జిల్లావాసులు ఎక్కడికై నా వెళ్లేందుకు బెంబేలెత్తుతున్నారు. అయితే స్లీపర్ బస్సుల్లో కూడా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక బస్సుకు సంబంధించి ఒకరే డ్రైవర్ ఉండటం ఎమర్జెన్సీ డోర్ల విషయంలో స్పష్టత లేకపోవడం ఇతర అనేక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. డ్రైవర్లు సెల్‌ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా.. గుట్కా, పాన్ లాంటివి వాడుతూ నడుపుతున్నారా.. అని తనిఖీ చేసేవారు లేకపోవడం.. బస్సును కూడా ఇష్టారాజ్యంగా స్పీడుతో వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ కూడా చూసీచూడనట్లు వెళ్తుండటం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బస్సులు ఎంత వరకు ఫిట్
జిల్లాలోని మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 25 నుంచి 30 బస్సుల మేర వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు రవాణా శాఖ అధికారులు బస్సుల సౌకర్యాలతో పాటు ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించాల్సి ఉంది. అత్యవసర ద్వారాలను మొదలుకొని ఏదైనా ప్రమాదాలు జరిగినపుడు అప్రమత్తం చేసేలా చర్యలు తీసకోవాలి. చాలా వరకు ప్రైవేటు వ్యవహారం కావడంతో బస్సులకు సంబంధించి టైర్లు దెబ్బతినడం... ఇద్దరు డ్రైవర్లు లేకపోవడం... పాన్, గుట్కాలు లాంటివి వాడటం.. ఎవరూ చూడలేదన్న ధీమాతో సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. మద్యం తాగి ఓనర్లకు తెలియకుండా డ్రైవర్లు బస్సులను నడపటం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ అవసరం
జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తిరిగే స్లీపర్ బస్సులతో పాటు నైట్ సర్వీసుల విషయంలో యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎక్కడికక్కడే డ్రైవర్లకు ముఖం కడిగించడం, స్పీడ్ విషయంలో పర్యవేక్షిస్తుండటం, ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూడటం చేస్తే ఎంతో కొంత ప్రయాణికులకు భద్రత దొరుకుతుంది. రవాణ శాఖ అధికారులే కాకుండా పోలీసులు, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.
ఈ సొసైటీకి రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖలు, అత్యంత ధనవంతులు నివసించే సోసైటి కాలనీ, సిటిఎంరోడ్డులోని రాజరాజేశ్వరీ ఆలయం వెనుక ఉన్న భూములు, రింగ్‌రోడ్డు సమీపంలో పాతబైపాస్‌రోడ్డుపైన భూములు ఉన్నట్టు సహకారశాఖ అధికారులు తెలిపారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణంపై జంకుతున్న జనం
బస్సుల ఫిట్‌నెస్ విషయంలోనూ అయోమయం
ఇటీవల గువ్వలచెరువు ఘాట్‌లో అదుపు తప్పిన ట్రావెల్స్ స్లీపర్ బస్సు
జిల్లాలోని రాజంపేట, రాయచోటి, మదనపల్లి, పీలేరు, రైల్వేకోడూరుల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రతి నిత్యం ప్రైవేట్‌స్లీపర్, ఏసీ బస్సులు నడుస్తుంటాయి. అంతేకాకుండా రైల్వేకోడూరు, రాజంపేట, కడప , మైదుకూరుల మీదుగా హైదరాబాద్ విజయవాడలకు వెళ్లే బస్సులు కోకొల్లలు. మదనపల్లె, రాయచోటిల మీదుగా, పీలేరు ఇతర ప్రాంతాల నుంచి కూడా మదనపల్లె మీదుగా బెంగళూరుకు వెళ్లే బస్సులు ఉన్నాయి. అయితే వేగాన్ని ఎవరూ నియంత్రించడం లేదు. రాత్రి 10 గంటలకు బస్సు కదిలితే తెల్లారే లోపు కేవలం ఆరేడు గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానం చేర్చాలన్న పట్టుదలతో వేగంగా వెళ్తున్నారు. బస్సులోనూ డ్రైవర్లు, ఆపరేటర్లు తప్ప ఓనర్లు ఉండరు. అంతేకాకుండా రవాణ శాఖ అధికారులు కూడా ఎక్కడా మధ్యలో వేగం విషయంలో ప్రశ్నించడంలేదు. ఈ నేపథ్యంలో బస్సు సీటు వేడి కూడా ఎక్కువై ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు.
● వేగానికి లేని కళ్లెం
● వేగానికి లేని కళ్లెం


