శుభపరిణామం
తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలిలో శ్రీవారి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం. దివంగత సీఎం వైఎస్సార్ పాలనలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ఏర్పాటు తరుణంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి బీజంపడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నమయ్య థీంపార్కును సందర్శించి, ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని కోరారు. అలాగే పూర్తయింది. ఇప్పుడు భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది.
–ఆకేపాటి అమర్‌నాథరెడ్డి,
ఎమ్మెల్యే, రాజంపేట
ఆనందదాయకం
అన్నమయ్య థీంపార్కులో శ్రీవారి ఆలయం నిర్మించి, విగ్రహప్రతిష్టమహోత్సవాలు చేయడం శుభపరిణామం. ఈ మార్గంలో వెళ్లే యాత్రికులు, భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ వీలు కల్పించడం హర్షణీయం. శ్రీవారి ఆలయం అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులను కోరాం. ఇప్పటికి విగ్రహాప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించడం ఆనందదాయకం. –చొప్పా గంగిరెడ్డి్,
ఏయూ అధినేత, రాజంపేట
శుభపరిణామం


