
ఈ–క్రాప్ నమోదు గడువు పెంపు
రాయచోటి: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ–క్రాప్ నమోదు గడువును ఈనెల 25వ తేదీ వరకు పెంచారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జి శివనారాయణ శనివారం తెలిపారు. సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పు చేర్పులకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. తుది జాబితాను ఈనెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సారి ఈకేవైసీని నోటిఫైడ్ పంటలకు మాత్రమే పరిమితం చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి పేర్కొన్నారు.
సిద్దవటం: కార్తీక మాసంలో భక్తులు నిత్యపూజయ్య స్వామికి సమర్పించే తలనీలాల పోగు హక్కు కోసం శనివారం నిర్వహించిన వేలంపాటలో రూ.3.30 లక్షలకు హెచ్చుపాటదారుడు దక్కించుకున్నాడు. దేవదాయశాఖ ఈఓ శ్రీధర్, రాజంపేట ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ ఆధ్వర్యంలో జరిగిన వేలంపాటలో 16 మంది పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు, ప్రొద్దుటూరు, చాపాడు, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాలకు చెందిన ఐదుగురు లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఇందులో చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన జి.రామక్రిష్ణ రూ.3.30 లక్షలకు తలనీలాల పోగు హక్కును దక్కించుకున్నాడు. అనంతరం మిగిలిన డబ్బులు చెల్లించి అధికారుల నుంచి రసీదును పొందారు.
ఒంటిమిట్ట (సిద్దవటం): ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం స్నపన తిరుమజనం వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలోని మూలవిరాట్‌కు అర్చకులు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ వారు సమర్పించిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
రాయచోటి టౌన్: రాయచోటి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శనివారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జులై 1వ తేది నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.22,99,430 వచ్చినట్లు ఈవో డీవీ రమణా రెడ్డి తెలిపారు. అలాగే 43.063 గ్రాముల బంగారం, 1.870 కిలలో వెండి వచ్చిందని చెప్పారు. ఈ మొత్తం ఎస్‌బీఐ, ఏపీజీబీ బ్యాంకులో జమ చేశామని వివరించారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి విశ్వనాథ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.
కలికిరి(వాల్మీకిపురం): వాల్మీకిపురం పట్టణానికి క్రికెట్ క్రీడాకారుడు దీపన్ సాయినాథ్ ఆంధ్రా రంజీ ప్రాబబుల్స్‌కు ఎంపికై నట్లు వాల్మీకిపురం సీడీసీఎ హెడ్‌కోచ్ సునీల్ కుమార్ తెలిపారు.శనివారం ఆయన మా ట్లాడుతూ దీపన్ సాయినాథ్ లెఫ్ట్‌హ్యాండ్ స్పిన్ బౌలర్‌గా చిత్తూరు జిల్లా జ ట్టుకు, అనంతరం సౌత్‌జోన్ నుంచి ఉత్తమ ప్ర తిభ కనపరచి ఆంధ్ర రంజీ క్యాంపునకు ఎంపికై న ట్లు చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలో న్యూజిలాండ్ నుంచి వ చ్చిన, రాష్ట్ర కోచ్‌ల పర్యవేక్షణలో క్యాంపు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అ సోషియేషన్ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమా ర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోషియేషన్ కార్యదర్శి సతీష్ యాదవ్, ఉపాధ్యక్షుడు శ్రీధర్‌కుమార్ సాయినాథ్‌కు అభినందనలు తెలిపారు.

ఈ–క్రాప్ నమోదు గడువు పెంపు

ఈ–క్రాప్ నమోదు గడువు పెంపు