
చావు ముందు ఎంతటి పెద్ద సమస్య అయినా చిన్నదే..
మనిషి జీవితానికి ముగింపు చావు. చావు ముందు ఎంత పెద్ద సమస్య అయి నా చాలా చిన్నదే. అందువల్ల క్షణికావేశంలో ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకోవడం అంత పిరికితనం మరొకటి లేదు. ఏదైనా బతికి సాధించాలే కాని బలవంతంగా ప్రా ణాలు తీసుకుంటే అమితంగా ప్రేమించే కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేసినట్లే.
– కాశిగారి ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, అన్నమాచార్య యూనివర్శిటీ, రాజంపేట
మనిషికి జీవితం భగవంతుడు ఇచ్చిన వరం. అందువల్ల ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి బతికి జీవితాన్ని ఆస్వాదించాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవారు మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. అలాంటి సమయంలో ఆత్మీయులతో మాట్లాడటం, వ్యాయామం, యోగా వంటివి చేస్తే మనసు కుదుటపడి మానసిక ప్రశాంతత నెలకొని ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి బయటపడగలరు.
– జి.భానుమూర్తిరాజు, రాష్ట్ర ప్రాంతీయ వ్యాయామ విద్య తనిఖీ అధికారి
కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది సమస్యను ఎదుర్కోలేక తనువు చాలించాలనుకొని తల్లిదండ్రులకు, జీవిత భాగస్వామికి, పిల్లలకు, తోబుట్టువులకు జాగ్రత్తలు చెబుతుంటారు. మరికొంత మంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి వారు చనిపోతానంటూ బెదిరిస్తారు. ఎవరైనా అలా మాట్లా డితే పెడచెవిన పెట్టకుండా అప్రమత్తం కావాలి. వీలైతే మానసిక వైద్యులకు చూపించాలి. – డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు,
సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట

చావు ముందు ఎంతటి పెద్ద సమస్య అయినా చిన్నదే..

చావు ముందు ఎంతటి పెద్ద సమస్య అయినా చిన్నదే..