
తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం
వీరబల్లి : మండల కేంద్రంలోని బస్టాండ్‌లో కరిము ల్లా అనే వ్యక్తి బోదకొట్టం నిర్మించుకొని టీ అమ్ముకొని జీవనం సాగించేవాడు. మంగళవారం రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం ఇన్‌చార్జ్ పదవి చేపట్టిన జగన్ మోహన్ రాజు మొట్టమొదటి సారిగా మండలానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌లో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో టపాసులు కాల్చడంతో అవి ఆ బోదకొట్టంపై పడి పూర్తిగా కాలిపోయింది. దీంతో కరీముల్లా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో నిరుత్సాహంగా ఉండిపోయింది. కరీముల్లా ఇటీవల వేలు ఖర్చుచేసి బోదకొట్టం ఏర్పాటు చేసుకున్నాడు.
టపాసులు పడి బోదకొట్టం దగ్ధం