
పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు
రాయచోటి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్సును రద్దు చేసినట్లు ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాజంపేటలో సీఎం పర్యటన నేపథ్యంలో గ్రీవెన్సెల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆదివారం ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసాలతో జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని పేర్కొన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జర్మన్ నర్సింగ్ ట్రైనింగ్ ప్రోగ్రా మ్‌ను ఉచితంగా నిర్వహించనున్నట్లు చైర్మన్ జి.రాజ్యలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారై నర్సింగ్ డిగ్రీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. వయసు 20 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. జిల్లాలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేయనున్నారని ఎంపికై న అభ్యర్థులకు 8 నుంచి 10 నెలల పాటు తిరుపతిలో శిక్షణ ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటీ లోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఉభయదారులచే పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలను ఆలయ చైర్మన్ సుధీకర్‌రెడ్డి, ఈఓ కేవీ రమణ పర్యవేక్షించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప టెలికాం ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ రిజిస్టర్ నంబర్ 1415 కడప వైఎస్సార్ కడప జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు సుబ్రహ్మణ్యం, మురళి పేర్కొన్నారు. శని వారం నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యక్షులుగా కళ్యా సుధాకర్, ఉపాధ్యక్షులుగా ఆకుల సుబ్బారావు, కార్యదర్శిగా ఎం.సి.సుబ్బారెడ్డి, సభ్యులుగా ఎ.వెంకటేశ్వర్లు, బి.నాగరాజు, ఎం.రఘురామయ్య, వి.వెంకట రమణయ్య ఎన్నికయ్యారని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగుల ఇంటి స్థలాల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. సొసైటీ తరఫున ఉద్యోగులకు, పెన్షనర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు