
కూటమి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ
అధ్యక్షురాలు వరుదు కల్యాణి
రాజంపేట: కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వరుదు కల్యాణి అన్నారు. ఆకేపాటి ఎస్టేట్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి అధ్యక్షతన మహిళా కమిటీల ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సంఘటితంగా ఏర్పడాలన్నారు. బూటకపు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చాక మోసం చేసే విధంంగా పాలన సాగుతోందన్నారు. అక్రమకేసులకు భయపడే ప్రసక్తిలేదన్నారు. మహిళ నేతలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని మహిళా విభాగాల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నుదున్నగా మహిళాలోకం నిలబడాలన్నారు. 2029లో ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు ఇప్పటి నుంచి ముందుకుసాగాలన్నారు. అవసరమైతే శాంతియుత పోరాటాలను చేయాల్సి వస్తుందన్నారు. కమిటీలో నియమితులైన మహిళా నేతలు నిరంతరం మహిళలను చైతన్య వంతులు చేసేందుకు కృషిచేయాలన్నారు.
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఐక్యంగా ముందుకుసాగాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు వరుదుకల్యాణి నేతృత్వంలో రాష్ట్ర మహిళా విభాగం బలోపేతం దిశగా పయనిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళల ఆశీర్వావాదాలు ఉండేలా కృషిచేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరిరెడ్డి, అనిశారెడ్డి, ఏకుల రాజేశ్వరరెడ్డి, గౌరీ, మిరియాలసురేఖ, మమత తదితరులు పాల్గొన్నారు.
● వరుదు కల్యాణిని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి ఘనంగా సన్మానించారు.