
● ఉల్లి రైతుల కంట కన్నీరు
కమలాపురం జెడ్పీటీసీ సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉల్లి సాగు చేసిన రైతులు ధరలు లేక కంట తడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి పంటను సభలో ఆమె ప్రదర్శిస్తూ కష్టాలను వివరించారు. ఎకరాకు సుమారు 80 వేల రూపాయల ఖర్చవుతోందని తెలిపారు. మార్కెట్‌లో వ్యాపారులు క్వింటాలు రూ. 800–900లతో కొనుగోలు చేస్తుండడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం క్వింటాలు రూ. 1200 ఇస్తామని చెబుతోందని, క్వింటాలు రూ. 1800–2000లతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ కింద కొనుగోలు చేసి ఆదుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలయ్య కోరారు.
● బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న ధరతో యూరియా ఎక్కడా రైతులకు అందుబాటులో లేదన్నారు. బస్తా సుమారు రూ. 500తో విక్రయిస్తున్నారన్నారు. అధిక ధరకు అడ్డుకట్ట వేయాలని కోరారు. లంచం లేకుండా నాడు–నేడు బిల్లులు చెల్లించడం లేదన్నారు.