
అధికార పక్షానికి 144 సెక్షన్ వర్తించదా !
సాక్షి టాస్క్ ఫోర్స్ : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం 144 సెక్షన్ అమల్లోకి తెచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. అయితే హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓబులవారిపల్లి మండలం చెన్నకేశవ స్వామి గుడి నుంచి రైల్వేకోడూరు పట్టణం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో పెద్దఎత్తున జన సమీకరణ చేశారు. డిప్యూటీ సీఎం సినిమా కావడంతో పోలీసులు కూడా వారిని అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులకు ఒక చట్టం, ఇతర పార్టీ నాయకులకు మరో చట్టం మాదిరిగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.