
నిరీక్షణ.. నిస్తేజం
ఇతని పేరు అనిల్ కుమార్ రాజు. సంబేపల్లి మండలం..జూన్ నెలలో కురిసిన కొద్దిపాటి వర్షా నికి నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాడు. పంట సాగు కోసం లక్షన్నర రూపాయలు ఖర్చు చేశాడు. ప్రభుత్వం ఇస్తానన్న పంట సాయం (అన్నదాత సుఖీభవ) డబ్బులు ఇవ్వలేదు. పూటకు ఒకలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ ఏడాది కూడా ఇస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇది.
రాయచోటి: ఎన్నెన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అమలులో అలక్ష్యం చేస్తోంది. అన్నదాతను ఆదుకోవడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తోంది. అన్నదాత సుఖీభవ అందిచడంలో శ్రద్ధ కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పినా ఇప్పటికీ చిల్లిగవ్వ ఇవ్వలేదు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నదాత సుఖీభవ నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
1,81,500 మంది రైతులే అర్హులట..
తాజా అంచనాల ప్రకారం జిల్లాలో 1,81,500 మంది పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా గుర్తించారు. కేంద్రం గుర్తించిన వారికి రాష్ట్రం కూడా అన్నదాత సుఖీభవ అర్హత జాబితాలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. గత వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లా నుంచి ఏటా రెండు లక్షల మందికి పైగా రైతులకు వైఎస్సార్ రైతు భరోసా, పీఈఎం కిసాన్ పథకాన్ని అందించారు. అంటే గతంలో ఇచ్చిన 20 వేల మందికి పైగా రైతులను అన్నదాత సుఖీభవ పథకానికి దూరం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన వాటాగా ఇస్తామన్న రూ. 14 వేలలో రూ. 5 వేలు ఇచ్చేయొచ్చుగా అని రైతులు అడుగుతున్నారు. పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆలస్యం అయిపోతోందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాన్పుడు ధోరణితో వ్యవహరిస్తుందన్న వ్యాఖ్యలు
వినిపిస్తున్నాయి.
బూటకపు హామీలతో అధికారంలోకి...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బూటకపు హామీలు ఎన్నో ఇచ్చింది. రూ. 15 వేలు అన్నారు. చివరకు వచ్చే ఏడాది కాలంగా దాటవేస్తూ వస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి 15 వేల కోట్ల రూపాయల భారం వేశారు.గత ప్రభుత్వం రూ. 13500 ఇస్తే..మేము అన్నదాత సుఖీభవ పేరుతో రూ. 20 వేలు ఇస్తామన్నారు. రెండో ఏడాదిలో సీజన్ ప్రారంభమైనా నయాపైసాను ప్రభుత్వం విడుదల చేయలేదు. డబ్బు లేనప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి? మోసం ఎందుకు చేయాలి అని ప్రజలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. అన్నదాత సుఖీభవం డబ్బులు జూన్ 12న ఇస్తామన్న ప్రభుత్వం మాట మార్చింది. జూలై 20న అమలు చేస్తామన్న మాటలు నీటి మూటలయ్యాయి. సత్వరమే అన్నదాత సుఖీభవ నిధు లు విడు దల చేయా లని జిల్లా రైతులు కోరుతున్నారు.
వైఎస్సార్ ప్రభుత్వం విడుదల చేసిన
రైతు బరోసా, పీఎం కిసాన్ నిధులు వివరాలు
రైతుల గోడు పట్టని ప్రభుత్వం
ఈ ప్రభుత్వానికి రైతుల గోడు పట్ట డం లేదు. ఖరీఫ్ సాగు కోసం రైతులు అప్పు లు చేసి దుక్కులు చేసుకున్నారు. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించే డబ్బుల కోసం ఎదురు చూసినా ఫలితం లేదు. అప్పు చేసి కొనుగోలు చేసిన విత్తనాలు ఎరువులు రైతుల ఇళ్లలోనే ఉండిపోయాయి. గతేడాది అన్నదాత సుఖీభవ నిధులతో కలిపి ఈ ఏడాది నిధుల ను ఇవ్వాలి. –సుగవాసి బాలసుబ్రమణ్యం,
జెడ్పీ మాజీ చైర్మన్, రాయచోటి
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రూ. 1049.62 కోట్లను వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే తీవ్ర వర్షాభావం వల్ల దెబ్బతిన్న పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్, నష్టపరిహారాన్ని అందజేసి అన్నదాతకు తోడుగా నిలిచింది. ఏటా జూన్ నెలలోనే మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి వారి వ్యవసాయ సాగు ఖర్చుల్లో భాగస్వామ్యంగా నిలిచింది. కోటి ఆశలతో కూటమి పాలనలోకి అడుగుపెట్టిన రైతులకు ప్రభుత్వం నుంచి గత ఏడాది అందాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదు. ఈ సవత్సరం ఖరీఫ్ సీజన్ సగం అయిపోయింది. జూలై నెల కూడా ముగుస్తోంది. అయినా ఇంకా డబ్బులు అకౌంట్లలో జమ కాలేదు. వస్తాయని, ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎప్పుడు అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఇదిగో,అదిగో అంటూ రోజులు గడుస్తున్నాయే తప్ప పథకం అమలు కాలేదని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కూడా భగ్గుమంటోంది. కేంద్రం ఎప్పుడు పీఎం కిసాన్ డబ్బులు ఇస్తే అప్పుడే తాము కూడా అన్నదాత సుఖీభవ అందజేస్తామంటూ దాటవేత ధోరణితో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో..
అన్నదాత సుఖీభవ నిధుల విడుదలెప్పుడో?
సాయం కోసం రైతుల ఎదురుచూపులు
2019–20 1,98,748 202.46
2020–21 2,08,836 210.92
2021–22 2,10,810 215.67
2022–23 2,01,829 268.62
2023–24 2,02,094 151.95

నిరీక్షణ.. నిస్తేజం

నిరీక్షణ.. నిస్తేజం

నిరీక్షణ.. నిస్తేజం

నిరీక్షణ.. నిస్తేజం

నిరీక్షణ.. నిస్తేజం

నిరీక్షణ.. నిస్తేజం