
సుముహూర్తాలు ఇవే..
రాజంపేట టౌన్/మదనపల్లె సిటీ/కడప సెవెన్‌రోడ్స్: శుభాల శ్రావణం వచ్చేస్తోంది. శ్రావణం అనగానే సుముహూర్తాలు మోసకొచ్చేదిగా ప్రజలు భావిస్తారు. ఇప్పటికే గురు మూఢం కారణంగా 48 రోజులుగా ఎక్కడా శుభ కార్యాలు లేవు. అందుకే శ్రావణమాసంలో ముఖ్యంగా జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వీటితోపాటు భూమి పూజలు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నారు. శ్రావణ పౌర్ణమికి ముందు అంటే ఆగస్టు 8వ తేది వచ్చే వరలక్ష్మివ్రతం మహిళలకు అత్యంత విశేషమైనది. మాఘం, వైశాఖం, శ్రావణం, మార్గశిర మాసాలు వివాహాలు, శుభ కార్యాలకు అనుకూలమైనవి.
ఆశల పల్లకిలో..
పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని కల్యాణ మండపాలన్నీ రిజర్వ్ అయ్యాయి. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలపై ఆధారపడ్డ వస్త్ర దుకాణదారులు, బంగారు వ్యాపారులు, మంగళ వాయిద్య కళాకారులు, వంట వారు, క్యాటరింగ్ సిబ్బంది, హోటళ్ల యజమానులు, పూల వ్యాపారస్తులు, మండపాల డెకరేషన్ నిర్వాహకులు తదితరులు ప్రస్తుత శ్రావణమాసంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వివాహ క్రతువులను నిర్వహించడంలో పురోహితులే కీలకం. వీరికి ఈ సీజన్‌లో బాగా డిమాండ్ ఉంటుంది. కడప నగరంలో ఈ మాసంలో పౌరోహితులు సగటున ఐదు వివాహాలు నిర్వహించనున్నారు.
ఈనెల 26 నుంచి వరుస ముహూర్తాలు
పురోహితులు, మంగళ వాయిద్యాలు, డెకరేషన్లకు డిమాండ్
కరువుతో బంగారు, వస్త్రాలకొనుగోళ్లపై ప్రభావం
శ్రావణమాసం ప్రారంభమైన మరుసటిరోజు నుంచే మంచి ముహూర్తాలు మొదలవుతాయని పురోహితులు వివరిస్తున్నారు. జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17వ తేది వరకు ఉన్నాయి. మళ్లీ సెప్టెంబరు 23, 24, 26, 27, 28 తేదీలు మంచి ముహూర్తాలుగా చెబుతున్నారు. అక్టోబరులో 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబరులో 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలని పేర్కొంటున్నారు.

సుముహూర్తాలు ఇవే..

సుముహూర్తాలు ఇవే..