
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
గుర్రంకొండ: గుర్రంకొండతోపాటు మండలంలో ని పలు గ్రామాల్లో సుమారు రూ.300 కోట్లు విలువచేసే వక్ప్‌బోర్డుభూములు కబ్జాకు గురయ్యాయి. ఒక్క గుర్రంకొండ పట్టణంలోనే రూ. 200 కోట్ల విలువచేసే వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. కడప–బెంగుళూరు జాతీయరహదారికి ఇరువైపు లా పట్టణంలో విలువైన వక్ఫ్‌బోర్డు స్థలాలు ఉన్నా యి. ఏళ్ల తరబడి వీటి ఆలనాపాలనా పట్టించుకొనే అధికారులు లేకపోవడంతో విలువైన స్థలాలు కబ్జా కు గురయ్యాయి. పట్టణంలో అధికశాతం మంది మైనార్టీలు నివసిస్తున్నారు. అయితే వీరికి ఏమా త్రం వక్ఫ్ స్థలాలు ఉపయోగపడడంలేదు. కొంతమంది కబ్జాకోరులు ఇష్టానుసారం వీటిని ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నారు. కనీసం మైనార్టీ లకు అవసరమైన షాదీమహల్, ఉర్దూ ఐటీఐ వంటి ప్రభుత్వసంస్థల నిర్మాణానికి అవసరమైన స్థలాలు కూడా లభ్యం కాని పరిస్థితి నెలకొడం దారుణమని మైనార్టీలు చర్చించుకుంటున్నారు.
శిలాఫలకంలో భధ్రంగా ఉన్న షాదీమహల్
గుర్రంకొండలలో వందల ఎకరాల వక్ఫ్ భూములున్నా మైనార్టీలకు అవసరమైన భవనాలు, షాదీమహల్ నిర్మించేందుకు కావాల్సిన స్థలాలకు మాత్రం కొరత ఏర్పడింది. 11 ఏళ్లకిందట షాదీమహల్‌నిర్మాణానికి మంజూరైన రూ.50లక్షల నిధులు వినియోగించక నిర్వీర్యమతువుతున్నాయి. జిల్లాలో మొదటిసారిగా గుర్రంకొండకు మైనార్టీ ఐటీఐ మంజూరురైంది. ఇందుకోసం అప్పట్లో ప్రభుత్వం రూ. 10 కోట్లు నిధులు మంజూరు చేసింది. గత 11ఏళ్లుగా షాదిమహల్ నిర్మాణం శిలాఫలకంలో భధ్రంగా ఉంది. మైనార్టీల ఐటీఐకి మాత్రం స్థల అన్వేషణలో అధికారులు ఉన్నారు.
మూడు సార్లు నిధుల మంజూరు
1999లో ఇక్కడ షాదీ మహల్ మంజూరైంది. అప్పట్లో షాదీమహల్ అభివృద్ధి కమిటి ఏర్పాటు చేసి రూ. 5లక్షలు నిధులు మంజూరు చేశారు. గ్రామంలోని వక్ఫ్ బోర్డు స్థలంలో ఐదు సెంట్ల స్థలం కేటాయించారు. అని వార్యకారణాలతో నిర్మాణం జరగలేదు. 2004లో మళ్లీ రెండో సారి మంజూరైంది. అప్పట్లో రూ.10 లక్షలు నిధులు మంజూరయ్యాయి. మళ్లీ స్థలం ఎంపిక సమస్య మారడంతో నిలిచిపోయింది. గ్రామంలో విలువైన మైనార్టీల భూములున్నా షాదీమహల్‌కు అవసరమైన స్థలం లేక పోవడం గమనార్హం. మళ్లీ 2013లో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి షాదీ మహల్ మంజూరుచేసి నిర్మాణానికి అవసరమైన రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారు. అదే ఏడాది మేనెల 27న నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయినా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికీ మూడు సార్లు నిధులు మంజూరై వెనక్కు వెళ్లిపోయాయి.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా గుర్రంకొండలో మా త్రమే మైనార్టీ ఐటీఐ మంజూరైంది. ఇందుకు అవ సరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రభుత్వం రూ. 10 కోట్ల ని ధులను కేటాయించింది. కళాశాల ఏర్పాటు కోసం 10 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. గుర్రంకొండ పరిసరాల్లోని ప్రభుత్వ భూములను సర్వేచే సి ప్రతి పాదనలు పంపించాలంటూ అప్పట్లో జిల్లా కలెక్టర్ స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జా రీ చేశారు. గ్రామంలో మైనార్టీలకు చెందిన వివిధ రకాల వందలాది ఎకరాల భూములున్నా అందులో పట్టుమని 10 ఎకరాల స్థలం లభించలేదు. దీంతో చేసేదిలేక రెవెన్యూ అధికారులు చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలోని గుట్టల్లో 5.06 ఎకరాల స్థలాన్ని సర్వేచేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంకా ఐదు ఎకరాల స్థలం అవసరం అవుతుంది. గ్రామంలో వందలకోట్లు కోట్లు విలువ చేసే మైనార్టీల భూములున్నా వారికి అవసరమైన ప్రభుత్వ భవన నిర్మాణాలకు కావాల్సిన స్థలాలు మాత్రం దొరక్క పోవడం గమనార్హం.
కలెక్టర్ దృష్టికి తీసుకెళతాం
గుర్రంకొండలో షాదీమహల్, మైనార్టీల ఐటీఐ నిర్మాణాలకు అవసరమైన స్థలాల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతాం. త్వరలో అన్యాక్రాంతమైన వక్ప్‌బోర్డు భూములన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. – వసీమ్ అక్రమ్,
వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్, అన్నమయ్య జిల్లా
స్థలం
కోసం
అన్వేషణ
రూ. 300 కోట్ల భూములు అన్యాక్రాంతం
పట్టించుకోని అధికారులు

కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు

కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు