● కొత్తవారిని జాయిన్‌ చేస్తే వెయ్యి! | - | Sakshi
Sakshi News home page

● కొత్తవారిని జాయిన్‌ చేస్తే వెయ్యి!

Jul 17 2025 3:50 AM | Updated on Jul 17 2025 3:50 AM

● కొత

● కొత్తవారిని జాయిన్‌ చేస్తే వెయ్యి!

కురబలకోట: డేటా ఎంట్రీ ఫారంలో ఒకటి రెండ్లు సంఖ్యలు రాస్తే డబ్బులిస్తామని నమ్మబలికి మహిళలకు రూ. 2 కోట్లకు పైగా మోసగించిన సంఘటన కురబలకోట మండలంలోని అంగళ్లులో బుధవారం వెలుగుచూసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో కలకలాన్ని సృష్టించింది. బాధితులు, రూరల్‌ సీఐ సత్యనారాయణ కథనం మేరకు...అంగళ్లు కదిరి రోడ్డులో మూడు నెలల కిందట ఎలైట్‌ క్రూవ్స్‌ డేటా సొల్యూషన్స్‌ పేరుతో బెంగళూరుకు చెందిన వినోద్‌కుమార్‌ అద్దె భవనంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. అంగళ్లు గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులను తాత్కాలిక ఉద్యోగులుగా నియమించారు. వీరికి రోజుకు రూ. 350 చొప్పన ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. వీరు పార్ట్‌ టైమ్‌ కింద డేటా ఎంట్రీకి వచ్చే మహిళలను రిజిస్ట్రేషన్‌ చేయడం, డబ్బులు వసూలు చేయడం లాంటి పనులు చేసేవారు. డేటా ఫారాలపై వారు చెప్పిన సంఖ్యల్లో ఒకటి రెండ్లు రాయాలి. మహిళలు తొలుత రూ. మూడు వేల చొప్పున చెల్లిస్తే వారికి వంద డేటా ఫారాలు ఇస్తారు. రాయాల్సిన సంఖ్యలను చెబుతారు. వీటిని ఎలాంటి తప్పులు,దిద్దుబాట్లు లేకుండా రాస్తే రూ. ఐదు వేలు ఇస్తారు. వంద మంది డేటా ఫారాలు తీసుకుంటే వీరిలో ఏ కొద్దిమందికో డబ్బులు ఇచ్చి మిగిలిన వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పులున్నాయనో..కొట్టివేతలు ఉన్నాయన్న సాకుతో వెనక్కి పంపేవారు. మూడు వేలు కడితే.. నంబర్లు రాస్తే రూ. 5000 ఇస్తారన్నది పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో రోజుకు వంద నుండి 150 మంది దాకా రిజిస్ట్రేషన్‌ చేసేవారు. ఒక్క అంగళ్లులోనే కాకుండా కురబలకోట, ముదివేడు, పీలేరు, మదనపల్లె, రాయచోటి, కలకడ, కలికిరి, వాల్మీకిపురం, చౌడేపల్లె, పుంగనూరు, గుర్రంకొండ, నిమ్మనపల్లెతోపాటు వివిధ ప్రాంతాల మహిళలు ఎక్కువగా ఉన్నారు. కొంత మందికి మాత్రమే డబ్బులు ఇచ్చి చాలా మందికి ఇవ్వకుండా మోసం చేస్తుండడంతో విధిలేని పరిస్థితిలో బుధవారం బాదితులు ముదివేడు పోలీసులను ఆశ్రయించారు. జరుగుతున్న మోసాన్ని వెల్లడించారు. అంతేకాదు గంటల వ్యవధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వందల మంది బాధిత మహిళలు అంగళ్లులోని ఓపీ స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై ఽకొంత సేపు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు విషయం తెలియడంతో ఈ సంస్థ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అందులో పనిచేసే 8 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. మహిళల నుండి వచ్చిన డబ్బులను క్యూర్‌ కోడ్‌ ద్వారా బెంగళూరులోని వినోద్‌కమార్‌కు పంపేవారమని చెబుతున్నారు. ఇతనికి అన్నమయ్య జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇలాంటి బ్రాంచ్‌లు ఉన్నట్లు వెల్లడవుతోంది. త్వరలో మదనపల్లె కూడా కొత్త బ్రాంచ్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించిన తరుణంలో ఇది బయటపడడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ కొత్త మోసం అన్నమయ్య జిల్లాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఒకటి రెండ్లు రాస్తే డబ్బులట..!!

మహిళలను మోసగించి రూ. 2 కోట్ల వంచన

పోలీసులను ఆశ్రయించిన వందలాది మంది బాధితులు

అంగళ్లులో ధర్నా, రాస్తారోకో

ఎవరైనా కొత్త వారిని జాయిన్‌ చేస్తే వారికి రూ.వెయ్యి చొప్పున నగదు ప్రోత్సాహం ఇచ్చేవారు. వారికి కూడా వంద డేటా ఎంట్రీ ఫారాలు ఇచ్చి సంఖ్యలు రాసుకుని రావాలని చెప్పేవారు.

ఇలా వెయ్యికి ఆశపడి పలువురు మహిళలు తెలిసిన వారితో పాటు ఇరుగుపొరుగు వారిని అధిక సంఖ్యలో చేర్చారు. బాధితుల్లో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీ మహిళలు ఉండడం గమనార్హం.

● కొత్తవారిని జాయిన్‌ చేస్తే వెయ్యి! 1
1/2

● కొత్తవారిని జాయిన్‌ చేస్తే వెయ్యి!

● కొత్తవారిని జాయిన్‌ చేస్తే వెయ్యి! 2
2/2

● కొత్తవారిని జాయిన్‌ చేస్తే వెయ్యి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement