
జిల్లా ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ సస్పెన్షన్
రాయచోటి : అన్నమయ్య, చిత్తూరు జిల్లాల ఇన్‌చార్జి హౌసింగ్ పీడీలు సాంబశివయ్య, గోపాల్‌నాయక్‌లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. అన్నమయ్య జిల్లా పీడీ హౌసింగ్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న అనగాని శ్రీహరి బదిలీ కాకుండా ఉండేందుకు లంచం అడిగిన కారణంగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌జైన్ అన్నమయ్య జిల్లా పీడీ హౌసింగ్ సాంబశివయ్య, గోపాల్‌నాయక్‌లను సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా హౌసింగ్ ఇన్‌చార్జి పీడీగా ఉన్న గోపాల్‌నాయక్ గతంలో అన్నమయ్య జిల్లా పీలేరులో హౌసింగ్ శాఖ డీఈగా పని చేసే వారు. ఏపీ ప్రభుత్వం కాండక్ట్ రూల్స్–1991 ప్రకారం సస్పెన్షన్ చేసినట్లుగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆ సమయంలో అన్నమయ్య జిల్లా పీడీ హౌసింగ్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న అనగాని శ్రీహరి బదిలీ కాకుండా ఉండేందుకు లంచం అడిగిన కారణంగా.. అన్నమయ్య జిల్లా పీడీ హౌసింగ్ గోపాల్‌నాయక్‌ను సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు పీడీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న ఆర్.గురుప్రసాద్, ఆర్.సుధాకర్, రఫీక్‌లను కూడా సస్పెండ్ చేశారు. ఇన్‌చార్జి పీడీలు ఇద్దరూ పై అధికారుల నుంచి అనుమతి లేనిదే అన్నమయ్య, చిత్తూరు జిల్లా కేంద్రాలను విడిచి వెళ్లరాదని కూడా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ సాంబశివయ్య ఇప్పటికే నకిలీ కుల సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందారన్న విషయంపై.. అందిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.