
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతుందన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
గంగమ్మా..కాపాడవమ్మా..
లక్కిరెడ్డిపల్లె : గంగమ్మ దేవతా కరుణించి కాపాడు తల్లీ అంటూ అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీ అనంతపురం గంగమ్మ దేవతకు భ క్తులు ఆదివారంప్రత్యేక పూజలు నిర్వహించా రు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రా వ డంతో క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పించారు. మొక్కులు ఉన్న భక్తులు అమ్మవారికి బోణాలు సమర్పించి, తలనీలాలు అర్పించారు.
హార్సిలీహిల్స్‌తో
‘కోట’కు అనుబంధం
బి.కొత్తకోట : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ తో అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్ సినిమా షూటింగ్ ఇక్కడ జరగ్గా ఆ సినిమాలో మంత్రి మహాంకాళీ పాత్రలో నటించిన కోట కీలకమైన సన్నివేశాల చిత్రీకరణకు హార్సిలీ హిల్స్ వచ్చారు. కొన్ని రోజులు ఇక్కడ విడిది చేసి షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ సినిమా షూటింగ్‌కు వచ్చారు. ఈ షూటింగ్ సందర్భంగా ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపినవారు మీడియాతో కోట శ్రీనివాసరావు సరదాగా జోకులు వేయడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు