
చక్రస్నానం..సర్వపాపహరణం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఇందులో చివరిఘ్టమైన చక్రస్నానం ఆదివారం వైభవంగా నిర్వహిచారు. ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథడికి గ్రామోత్సవం.. వసంతోత్సవాల నడుమ జరిగింది. ఆలయంలో ఉత్సవమూర్తులకు గంధం, పాలు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫలాలతో అభిషేకం భక్తిశ్రద్ధలతో జరిపారు. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్‌కుమార్, మనోజ్‌కుమార్, సునీల్‌కుమార్, సాయిస్వామిలు ఉత్సవమూర్తులకు కోనేటిలో చక్రస్నానం నిర్వహించారు. చక్రస్నానం అనేది బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనది. కోనేటిలో స్వామి స్నానం ఆచరించిన తర్వాత ముగినిన వారి పాపాలు తొలగుతాయని, మోక్షం లభిస్తుందని పండితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.
ఘనంగా సౌమ్యనాథడికి చక్రస్నానం