
విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం
మదనపల్లె సిటీ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరావు అన్నారు. సోమవారం మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యా, వైజ్ఞానిక సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వం వాటికి రెడ్ కార్పెట్ పరుస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో విద్యలో కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. పాఠ్యాంశాలలో వాస్తవ చరిత్రను కాలరాస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక..
ఎస్‌ఎఫ్‌ఐ సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడిగా పి.రామమోహన్, కార్యదర్శిగా కె.ప్రసన్నకుమార్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు పావని, పరమేష్, వెంకటేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రమణ పాల్గొన్నారు.

విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం