
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని నవాబుకోట పంచాయతీ వరికసువుపల్లిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పురిషిత్‌రెడ్డి (13) అనే బాలుడు మృతి చెందాడు. వరికసువుపల్లికి చెందిన ఎర్రవ్వగారి సుధాకర్ కుమారుడు పురిషిత్‌రెడ్డి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా బి.కొత్తకోట నుంచి టి.సదుం వైపు వెళుతున్న ఓ లారీ వేగంగా దూసుకు వచ్చి బాలుడిని ఢీకొంది.
దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు వెంటనే లారీని వెంబడించి డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.