
విద్యుత్ షాక్‌తో తాపీ మేసీ్త్ర మృతి
పీలేరు రూరల్ : విద్యుత్ షాక్‌తో తాపీమేసీ్త్ర మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణం మదనపల్లె మార్గం ఏపీఐఐసీ 3వ లేఅవుట్‌లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిలక్‌వీధిలో కాపురం ఉంటున్న అఫ్సర్‌పాషా (40) రోజువారి పనుల్లో భాగంలో ఏపీఐఐసీ 3వ లేఅవుట్‌లో ఇంటి నిర్మాణ పనికి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడ్డాడు. గమనించి సహచర కూలీలు చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతునికి భార్య ఫాతిమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.