విద్యార్థినికి గోల్డ్‌మెడల్ ప్రదానం
పీలేరు: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదివి గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలో తెలుగు సబ్జెక్టులో 99 శాతం మార్కులు సాధించిన విద్యార్థిని పి నందినికి ఇదే కళాశాల పూర్వ విద్యార్థి, పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ యర్రదొడ్డి సుభాషిణి గురువారం గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ సుభాషిణి మాట్లాడుతూ తాను చదివిన పాఠశాలలో మెరిట్ విద్యార్థినులకు ప్రతి ఏటా పతకాలు,సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎం ఫౌజియాబేగం, ఉపాధ్యాయినులు సుజాత, గంగయ్య, శ్రీకళ, ఉమామహేశ్వరి, రెడ్డి దీపారాణి, ఇంద్రాణి, ప్రసన్నలక్ష్మీ, రాధారాణి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పనుల పరిశీలన
రామాపురం: మండలంలోని హసనాపురం పంచాయతీలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను గురువారం పీడీ వెంకటరత్నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజువారి వేతనం రూ.350 వచ్చేలా ఉపాధి కూలీలు పని చేయాలన్నారు. మండలంలో మంజూరైన ఫారంపాండ్స్, పశువుల నీటి తొట్టె పనులు ఈ నెల చివరినాటికి పూర్తి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా కూలీలు 3 నెలలుగా చేసిన పనులకు డబ్బులు రాలేదని పీడీ దృష్టికి తీసుకురాగా మూడురోజుల్లో వస్తాయని తెలియజేశారు. లక్ష్మినరసయ్య, ఏపీఓ పెంచలయ్య, టీఏ చంద్రశేఖర్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు రవిశంకర్‌రెడ్డి, పక్కీర్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థినికి గోల్డ్‌మెడల్ ప్రదానం


