ముగిసిన టెట్ పరీక్షలు
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లా వ్యాప్తంగా 4 సెంటర్లలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 21వ తేదీ నిర్వహించిన పరీక్షలకు 4923 మంది అభ్యర్థులకు 4323 మంది హాజరయ్యారని తెలిపారు.
రాజంపేట టౌన్: రాజంపేట జిల్లా సాధన కమిటీ మంగళవారం రాజంపేట బంద్‌కు పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ ఉంటుందని, అందువల్ల వ్యాపారులు సంపూర్ణంగా బంద్‌కు సహకరించి తమ దుకాణాలను తెరవ వద్దని కోరారు.
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 22వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పీలేరురూరల్: చిత్తూరు శాంతా రఘురామన్ కల్యాణమండపంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్ పోటీలో పీలేరు విద్యార్థులు ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలిచినట్లు కుంగ్‌ఫూ మాస్టర్ దామోదర్ తెలిపారు. కటాస్, నాన్‌చాక్ విభాగంలో జరిగిన పోటీల్లో 17 మంది గోల్డ్ మెడల్, 16 మంది సిల్వర్ మెడల్, 12 మంది బ్రాంజ్ మెడల్ సాధించినట్లు చెప్పారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మ వారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీమ్‌లు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం.
పీలేరురూరల్: పదో తరగతి చదువుతున్న హాస్టల్ విద్యార్తులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్. నాగేంద్రరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని కోటపల్లె బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 45 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, అందులో 450 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. పీలేరు హాస్టల్‌లో మొత్తం 241 మందికి 227 మంది హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఉదయం, సాయంత్రం రీడింగ్ అవర్స్ విధిగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సహాయక అధికారి రవీంద్రరాజు, వార్డెన్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన టెట్ పరీక్షలు
ముగిసిన టెట్ పరీక్షలు


