హార్సిలీహిల్స్‌పైకి ఎన్‌సీసీ విద్యార్థుల ట్రెక్కింగ్
బి.కొత్తకోట: అంగళ్లులోకి మిట్స్ యూనివర్సిటీకి చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు ఆదివారం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. కొండకింద నుంచి ఉదయం ఏడు గంటలకు ట్రెక్కింగ్ ప్రారంభించి 11 గంటలకు కొండపైకి చేరుకున్నారు. ఎన్‌సీసీ లెఫ్టినెంట్ నవీన్‌కుమార్ విద్యార్థులకు రోప్ హ్యాండ్లిగ్, హిల్స్ కై ్లంబింగ్‌పై శిక్షణ ఇచ్చారు. 100 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ట్రెక్కింగ్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడేలా సి సెరిటిఫికెట్, బి సర్టిఫికెట్లపై శిక్షణ ఇచ్చామని నవీన్‌కుమార్ తెలిపారు.


