మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆకేపాటి
ఒంటిమిట్ట : మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. స్థానికుల వివరాల మేరకు..రాజంపేట మండలం, శేషమాంబపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వైష్టవి, సునీల్ బైకుపై సిద్దవటం వెళ్తుండగా ఒంటిమిట్ట పెట్రోల్ బంకు వద్దకు రాగానే లగేజ్ ఆటో ఢీ కొనడంతో బైకులోని వారిద్దరు కిందపడి రక్త గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర గాయాలతో రోదిస్తున్నారు. ఆ సమయంలో సిద్దవటం నుంచి రాజంపేట వెళుతున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వారిని చూసి కారులో నుంచి సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే నందలూరు నుంచి 108 వాహనాన్ని రప్పించి, అందులో వారిని కడప రిమ్స్‌కు తరలించారు.


