● పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ములకలచెరువు : మండలంలోని చౌడసముద్రం జెడ్పీహైస్కూల్‌లో 1972–73 సంవత్సరంలో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి గురువులతో పాటు అప్పటి విద్యార్థులు పాల్గొన్నారు. గురువులు రంగారెడ్డి, విశ్వనాథ్, ప్రస్తుత హెచ్‌ఎం అశ్వినిలను సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. పాఠశాల ఆవరణంలోని స్టేజీపై రూ. లక్ష ఖర్చు చేసి రేకులు వేయించారు. పూర్వ విద్యార్థులు పుట్టా శేఖర్‌గుప్తా, రత్నశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరమణ, మల్లప్పనాయుడు, మహబూబ్‌బాషా, గిరిజా కుమారి తదితరులు పాల్గొన్నారు.


