గుప్తనిధుల కోసం తవ్వకాలు
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్ల మౌలాకా పహాడ్ వద్ద ఉన్న ఓ ఇంటి ఆవరణలో గుప్తనిధులు వెలికి తీసేందుకోసం క్షుద్రపూజలు నిర్వహించినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గుప్తనిధుల కోసం తవ్విన ఇంటి ఆవరణాన్ని, పరిసర ప్రాంతాలను ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పరిశీలించారు.
అరుదైన వన్య ప్రాణుల స్మగ్లర్లు అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్ : అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం వన్య ప్రాణుల స్మగ్లింగ్‌కు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజ్‌కుమార్, భూపతిరాజు, జయరావ్, మొలకల సుబ్రమణ్యం, శ్రీరాములాయారి, శివ, రవికుమార్‌లను అరెస్టు చేశారు. ఫారెస్టు రిజర్వు అధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారిని కోర్టులో హాజరుపరిచారు. వారివద్ద నుంచి రెండు తలల పాము, అలుగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సోదరభావంతో మెలగాలి
మదనపల్లె సిటీ : హిందువులు సోదరభావంతో మెలగాలని శ్రీనివాసమంగాపురానికి చెందిన శ్రీ వశిష్ట్రాశమ శ్రీలలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి స్వస్వరూపానందగిరి స్వామి అన్నారు. ఆదివారం స్థానిక శేష్‌మహల్ టాకీసు సమీపంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సూచించారు. ఎన్ని మతాలు, కులాలు ఉన్నా మనమంతా ఒక్కటేనన్న భావన కలిగి ఉండాలన్నారు. వీహెచ్‌పీ కుటుంబ ప్రభోధన్ ప్రాంత ప్రముఖ్ పుట్టా శేషు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పి నాయకులు బండి బాలాజీ, పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు.
తల్లి మందలించిందని.. బాలుడి ఆత్మహత్య
కేవీపల్లె : పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి మందలించిందని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ కర్ణంవారిపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కర్ణంవారిపల్లెకు చెందిన నాగార్జున, అనితల కుమారుడు నాగచైతన్య (16) చౌడేపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటూ పాఠశాలకు వెళ్లేవాడు. కొన్ని నెలలుగా పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలో శనివారం పాఠశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడం, సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉండడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశానికి గురైన నాగచైతన్య ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్ తెలిపారు.
చిట్వేలి విద్యార్థులు
రాష్ట్ర స్థాయికి ఎంపిక
చిట్వేలి : రాయచోటి డైట్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో వి.దివ్యశ్రీ, ఎ సుస్మిత, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో కె చందు, పి భరత్ కుమార్, వ్యక్తిగత విభాగంలో రుకియా బాంభో, పల్స్ బయోడిగ్రీడబుల్ సానిటర్ పాడ్స్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయని తెలిపారు.
విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురం, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లోని పొలాల్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ చేశారు. మల్లికార్జునపురం గ్రామానికి చెందిన రైతులు మల్‌రెడ్డి, మస్తాన్, రామాంజనేయులు, నబీ రసూల్, సుధాకర్‌ల పొలాల్లోని మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు
గుప్తనిధుల కోసం తవ్వకాలు
గుప్తనిధుల కోసం తవ్వకాలు


