రెండు ద్విచక్రవాహనాలు ఢీ
రామాపురం : రామాపురం మండలం బండపల్లె గ్రామం వీఆర్ పాఠశాల సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు రామాపురం మండల వెంకటరెడ్డిగారిపల్లెకు చెందిన షేక్ గౌస్‌మొహిద్దీన్, అతని భార్య షేక్ గులాబ్‌జాన్, కుమారుడు మహమ్మద్ అనాస్‌లు రాయచోటికి వెళ్లి తిరిగి స్వగృహానికి ఏపీ04ఏబి 3151 ఎక్స్‌ఎల్ ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ బంక్ (వీఆర్ పాఠశాల) సమీపంలోకి రాగానే రాయచోటి వైపు నుంచి కడపకు వెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏపీ40 ఎఫ్‌సీ 7187 వాహనం అతి వేగంగా, అజాగ్రత్తగా, హారన్ కొట్టకుండా వచ్చి ముందు వెళ్తున్న ఎక్స్‌ఎల్‌ను బలంగా ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న షేక్ గౌస్‌మొహిద్దీన్, గులాబ్‌జాన్, మహమ్మద్ అనాస్‌లు రోడ్డుపై పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మండల ఎస్‌ఐ వెంకటసుధాకర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షేక్ గులాబ్‌జాన్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు


